DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం కాసిపేట - 2 గని పై “నా భద్రత నా బాధ్యత నా భద్రత నా కుటుంబ భద్రత” మరియు "పర్యవేక్షకులు - అమలుపరుచు వారి యొక్క పాత్ర" పై అవగాహన సమావేశంలో సింగరేణి యాజమాన్యం ఆదేశాల మేరకు నేడు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రమాదాలు అసలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటిని ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వివరాలు తెలియ చేస్తూ, నా రక్షణ నాదే బాధ్యత నుండి నా రక్షణ నా కుటుంబ బాధ్యతగా మనకు మనమే సతహగా రక్షణ పొందాలని జనరల్ మేనేజర్ (సేఫ్టీ) బెల్లంపల్లి రీజనల్ అన్నారు.
అలాగే రక్షణ అవగాహన సమావేశంలో కుటుంబ యజమాని ఆరోగ్యం గా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉంటుందని, అప్పుడే సంస్థ బాగుంటుందని అలాగే సమావేశాలు జులై మాసం మొత్తం ఉంటాయని, రక్షణ ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఉoడాలని తెలిపారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యముగా ఉంటే సమస్త బాగుంటుందని, అవగాహన తో ప్రమాదాలను నివారించవచ్చునని, పని పైన ధ్యాసతో చేయాలని, అప్రమత్తతతో ఉండాలని అన్నారు.
సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్లాన్, (ఎస్ఎంపి) సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ ఓ పి) పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పని పైన అవగాహన కలిగి ఉండడంతో ప్రమాదాలను నివారించుకోవచ్చని, పని చేసే విధానాలు తెలుసుకోవాలని అన్నారు. సేఫ్టీ పై అవగాహన కలిగి శిక్షణ పొంది ఉండేందుకు సింగరేణి యాజమాన్యం శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తుందని సింటాస్ అధికారి ఏ కె కె శర్మ అన్నారు. అలాగే ఉత్పత్తి తో పాటు రక్షణ నియమాలను పాటించి బొగ్గు ఉత్పత్తి తీసుకురావాలని ఉద్యోగులను కోరారు. అలాగే ఈ సందర్భంగా.. ఏజెంట్ రామదాసు మరియు మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..... చిన్న చిన్న పొర పాట్లు సవరించుకొని ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని అన్నారు. గని జీరో ప్రమాదరహిత గని గా మార్చగల బాధ్యత మనందరి పైన ఉందని మరియు సూచించిన A, B, C, D సూత్రాలను పాటించాలని తెలిపారు . ఈ యొక్క కౌన్సిలింగ్ కార్యక్రమంలో రక్షణ అధికారి సంతోష్ రావు టీబీజీకేఎస్ ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ కారుకురి తిరుపతి, గొల్ల శ్రీనివాసు, ఇంజనీర్లు భీమ్ రెడ్డి రఘు, నంద కిశోర్, సర్వేయర్ ప్రకాష్ రావు, వెల్ఫేర్ ఆఫీసర్ భార్గవ్ మరియు మైన్స్ & సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




