DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు, రేపు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్న విద్యార్థులు ఇంటికి వెళ్తున్నారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకిరావద్దని తెలిపారు.

