DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే....బెల్లంపల్లి మండలంలోని సోమగూడెంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన జనగామ తిరుపతి తన భార్య అయిన జనగామ రజిత వయసు (40) తన మోటారు సైకిల్ పై బెల్లంపల్లికి వైపు వెళుతుండగా మార్గమధ్యలో బైపాస్ రోడ్డు బెల్లంపల్లి NH 363 వద్ద చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ అతివేగంగా అ జాగ్రత్తగా నడిపి జనగామ తిరుపతి నడుపుతున్న బైకును వెనకాల నుండి ఢీకొట్టగా అతను మరియు అతని భార్య కింద పడగా ఆమెకు తలకు బలమైన గాయం కాగా మరియు ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త జనగామ తిరుపతి ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు కాళ్లకు ఎడమ భుజానికి గాయాలు అయినట్లు తెలిసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

