DIGITAL MANCHERIAL NEWS:- నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఓ యువకుడు పై గుర్తుతెలియని వ్యక్తి కత్తిపోట్లతో కలకలం సృష్టించాడు.
వివరాల్లోకి వెళితే... పట్టణంలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన తోట శంకర్ (30) అనే వ్యక్తిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళ సదరు వ్యక్తి బైక్ పై గోపాల్ నగర్ కాలనీకి వచ్చి తోట శంకర్ ను బయటకు పిలిచినట్లుగా సమాచారం. నిద్ర నుంచి మేల్కొని ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చిన యువకునిపై సదరు వ్యక్తి కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డట్లుగా తెలిసింది. ఇక బాదితుడు అరుపులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు బయటికి వచ్చేసరికి దీంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి తాను తీసుకవచ్చిన బైక్ ను అక్కడే వదిలి పారిపోయినట్లుగా తెలుస్తోంది. గాయాలపాలైన తోట శంకర్ ను కాలనీకి వాసులు హుట హూటిన స్థానిక ఏరియా అసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రి కి తరలించినట్లుగా తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బైకు ను స్వాధీన పరచుకున్నారు. నిందితుడు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.

