బ్రేకింగ్ న్యూస్:- ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశత్తు ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

 వివరాల్లోకి వెళితే....దహేగాంలోని మండలం లగ్గాం గ్రామ శివారులో పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోర్లపడడంతో సంతోష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కర్జి గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు.

 స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. ప్రమాదమునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by