DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశానుసారం సోమవారం ఉదయం కన్నేపల్లి మండలంలోని వీరపూర్ గ్రామానికి చెందిన సొండ్ల గుండయ్య కి 20,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సర్పంచ్ జిల్లెల్ల అశోక్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎంతో అండగా నిలుస్తుందని, రానున్న ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు జిల్లెల్ల మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

