వివరాల్లోకి వెళితే.... పెంచికలపేట మండలంలోని లోడుపల్లి గ్రామానికి చెందిన పోతరాజుల భీమయ్య (50), అదే గ్రామానికి చెందిన అల్లుడు సేగం తిరుపతి, మరొక అల్లుడు కన్నెపల్లి మండలం గ్రామానికి చెందిన బోర మల్లేష్ శుక్రవారం పుల్లుగా మద్యం సేవించి... మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవపడ్డారు. ఈ క్రమంలో భీమయ్యపై దాడి చేయడంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాజక్క
ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ రూరల్ సీఐ నాగరాజు, ఎస్సె కొమరయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

