ఫ్లాష్ న్యూస్:- నడిరోడ్డు పై మహిళా దారుణ హత్య...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో నడిరోడ్డుపై పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది.

 వివరాల్లోకి వెళితే... మంచిర్యాల పట్టణంలోని గోపాల్ వాడలో నివాసం ఉండే శరణ్య (23) మేడి లైఫ్ హాస్పటల్లో రిసెప్షన్ లిస్టు గా పని చేస్తుంది. అయితే గురువారం సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపాన కత్తులతో పొడిచి హతమార్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్, ఎసీపీ తిరుపతి రెడ్డి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏ కారణం చేత శరణ్యను దుండగులు హతమార్చరనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by