తల్లిదండ్రులు...మీ పిల్లల అభివృద్దికై మాతో కలసిరండి:- సిఓఈ ప్రిన్సిపాల్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- గురుకులంలో ఇంటి వాతావరణాన్ని నిర్మించుకోవడం ద్వారా పిల్లల మానశిక ఎదుగుదల గొప్పగా ఉంటుందని అట్లాంటి అభివృద్దికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి రావాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి ప్రిన్సిపాల్ ఐనాల సైదులు పిలుపునిచ్చారు.


 ఈ సందర్భంగా శనివారం సిఓఈ లో జరిగిన పేరెంట్స్ డే సమావేశంలో పేరెంట్స్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా సిఓఈ అభివృద్దిలో పేరెంట్స్ కమిటీ ఆద్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయని మునుముందుకూడా అలాగే సహకరించాలన్నారు. గురుకుల సంస్థ అధికారుల పూర్తిస్థాయి సహకారంతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.   


 

గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో 100 శాతం ఫలితాలతో ఇంటర్మీడియట్ లో ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో బెల్లంపల్లి సత్తా చాటి తల్లిదండ్రుల్లో ఆనందాన్ని నింపారన్నారు. తల్లిదండ్రులు కలలు కన్నట్లుగా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో గురుకులంలో ప్రతి ఉద్యోగి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నవిషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే గురుకులాల కార్యదర్శి డా.నవీన్ నికోలస్ ఐఏఎస్ ప్రత్యేక ప్రణాళికతో గురుకులాలను అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గురుకులాల్లో ఎలాంటి సమస్యలున్నా చేయీ చేయీ కలిపి పరిష్కరించుకుందామన్నారు. అదేవిధంగా పేరెంట్స్ కమిటీ ఉపాధ్యాయుల కృషిని గుర్తించి గౌరవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు పుదారి నగేష్ గౌడ్, ఉపాధ్యక్షులు ఇప్పరవి, కార్యదర్శి పెరుగు తిరుపతి, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్, దాసం అజిత, రాజేశం, షిండే దత్తప్రసాద్, యండి రఫి,ఎండి కౌసర్, నడిగోటి రాకేష్, తల్లిదండ్రులు కొమ్ముల శ్రావణి, దాగం మహేష్, గొర్లపల్లి సోమశేఖర్, గోగర్ల రమేష్, వెంకటస్వామి, సుద్దాల శంకర్, బానోతు సంపత్, కొమ్ముల శ్రావణి, చెప్పకుర్తి సతీష్, దాముఖ లక్ష్మణ్, అశోక్, వేల్పుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by