మణిపూర్‌ దాడులు దురదృష్టకరం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మణిపూర్‌లో జరుగుతున్న మూక దాడులు దుర దృష్టకరమని పాస్టర్లు అన్నారు.


 ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి రైల్వే స్టేషన్‌, ప్లైఓవర్‌ బ్రిడ్జి ఐబీ చౌరస్తా మీదుగా పాఠశాల వరకు క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్లర్టు మాట్లాడుతూ.... ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హింసకాండ సాగిస్తున్నారని, ఒక వర్గాన్ని పూర్తిగా మణిపూర్‌లో అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్న వారిని అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతు న్నాయన్నారు. అల్లర్ల కారకులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్లర్లు, క్రైస్తవులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by