DIGITAL MANCHERIAL NEWS:- ఎలక్షన్స్ దగ్గర పడడంతో కావాలని కొందరు నాయకులు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ని బాధునాం చేస్తున్నారని నేతకానీ యువ నాయకుడు జాడి రాజేష్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మా జాతి బిడ్డ ఏకైక ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందితే ప్రతిపక్షాల పప్పులు ఉడకవు అని కొందరు కుట్రలు చేసి ఎలా అయిన ఎమ్మెల్యే ని చెడు ప్రవాహంతో దెబ్బ తీయాలని చూస్తున్నరు. ఒక అమ్మాయినీ అడ్డం పెట్టుకొని ప్రోత్సహించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. తన రాజకీయా భవిషత్తు చిన్న పదవి నుండి మొదలు పెట్టి ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదుగుతే ఓర్వలేక రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన ఎమ్మెల్యే మళ్ళీ గెలిపించి తీరుతాడని అన్నారు.

