DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మరోసారి మానవత్వాన్ని చాటుకొని ప్రజలను మనసును గెలుచుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... కన్నెపల్లి మండలానికి చెందిన గొర్లపల్లి కిష్టయ్య కుమారుడు యోగేశ్వర్ నాగర్ కర్నూల్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఎంబిబిఎస్ సీటు సాధించగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అభినందించారు. ఆ విద్యార్థి పేద కుటుంబం కావడంతో ఆయనకు ఖర్చులకు తక్షణ సాయం కింద రూ 10, 000 అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కష్టపడి ఇష్టంతో చదివితే ఎంతటి దానినైనా సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

