వివరాల్లోకి వెళితే...
ఈ క్రమంలో మంటలు ఎగిసిపడడంతో కరీంనగర్ నుండి మరొక ఫైర్ ఇంజన్ ని తెప్పించి మరింత ప్రమాదం జరగకుండా రెండు గంటల పాటు శ్రమించామన్నారు. ఈ సంఘటనలో ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిలిందనే సమాచార వివరాలను సేకరిస్తామన్నారు. సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదమునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పెద్దపెల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పరిధిలోని జాతీయ రహదారి కాట్నాపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రాజీవ్ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘోర సంఘటన లారీలో ఉన్న డ్రైవర్ మృతి చెందాడు. మృతుదేహం గుర్తుపట్టలేనంతగా మాంస ముద్దలుగా మారిందని పెద్దపల్లి అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు రెండు లారీలు వస్తున్నాయి, ముందు లారీ వరి ధాన్యంతో వస్తుండగా, వెనక లారీ పేపర్ బెండలతో వస్తుంది. ఈ క్రమంలో రెండు లారీలు ఢీకొనగా ఒక్కసారిగా పెను మంటలు చెలరేగడంతో అగ్నిఖిలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి అందిన సమాచారం మేరకు పెద్దపల్లి నుండి ఫైర్ వాహనంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.