DIGITAL MANCHERIAL NEWS:- మరోమారు గొప్ప మనసు చాటుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్.
- ఇద్దరు నిరుపేద విద్యార్థుల MBBS చదువులకి తలా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేత.
- విద్యార్థి సుమంత్ కు అదనంగా మరో రెండు లక్షలు అందించాలని కలెక్టర్ కి ఆదేశం.
ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోమారు తన ఉదార గుణాన్ని చాటుకున్నారు. పేదరికం ఉన్నత చదువులకు అడ్డుకాకూడదని గొప్ప మనసుతో... చెన్నూర్ నియోజకవర్గం, కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కొండగుర్ల సుమంత్ S/O గుండయ్య అనే విద్యార్థికి టిఆర్ఆర్ మెడికల్ కాలేజీలో సీటు రాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థి సుమంత్ కు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతే కాకుండా ప్రభుత్వపరంగా రెండు లక్షల రూపాయలు అందించాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. అలాగే చెన్నూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ రాయిపేట్ గ్రామానికి చెందిన మరొక నిరుపేద విద్యార్థి దుర్గం రంజిత్ S/O కిష్టయ్యకు ఎంబిబిఎస్ ఉన్నత చదువుల కోసం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి భవిష్యత్తుకు చేయూతనందించారు.
తాము అడిగిన వెంటనే తలా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి ఇద్దరు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.


