DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ఐటి రంగం దినదినాభివృద్ధి చెందుతుంది.
కాగా పట్టణంలోని కాల్ టెక్స్ ప్రాంతంలో సనాతన ఐటీ కంపెనీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతుంది. ఈ విషయమై హైదరాబాదులోని అసెంబ్లీ వద్ద ఐటి, మున్సిపల్ శాఖ ల మంత్రి కార్యాలయంలో కల్వకుంట తారక రామారావును బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లిలో ఐటి సంస్థలను మరింత అభివృద్ధి పరిచి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి కెటి రామారావు కు బెల్లంపల్లి ఎమ్మెల్యే వివరించారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, సనాతన ఐటి సంస్థ నిర్వాహకులు ఎర్ర శ్రీరంగ నాథరాజు, ఎర్ర శ్రీ నాథరాజు, ఎర్ర సాయి నాథరాజు తదితరులు పాల్గొన్నారు.


