DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో, మరియు తాళ్ల గురజాలలోని హాస్పిటల్లో ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. త్రివర్ణ పథకాన్ని ఎగరవేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.... మనకు ఈ రోజు స్వతంత్రం రావడానికి ఆరోజు ఎంతోమంది తమ ప్రాణాలను బలంగా పెట్టి, తమ ప్రాణాలను కోల్పోవడం వల్లే మనం ఈరోజు ఇలా స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉన్నామన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీవో, డాక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇతర బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



