DIGITAL MANCHERIAL NEWS:- కన్నేపల్లి మండలంలోని వీరపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం 77 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ జిల్లెల్ల అశోక్ గౌడ్.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఆనాడు ఎందరో మహానీయులు తమ ప్రాణాలను అర్పించడం వల్లే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, ఉప సర్పంచ్ సుధీర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్ గౌడ్, అంగన్వాడీ ఉపాధ్యాయులు ఉదయ శ్రీ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, BRS కార్యకర్తలు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

