DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కౌంటర్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.35 లక్షలు స్వాహ చేసినట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీపతి బాబు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కౌంటర్ లో ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. సదరు ఉద్యోగి రూ.35 లక్షలు క్యాష్ మేనేజ్మెంట్ సిస్టం (సిఎంఎస్) హైదరాబాద్ పేరిట జమ చేసి పంపించాలి. కానీ, గత ఏడు నెలల నుంచి కౌంటర్ ద్వారా వచ్చిన డబ్బును సక్రమంగా జమ చేయకుండా మిగిల్చుకున్నాడని తెలిసింది.
ఈ వ్యవహారాన్ని గత జనవరి నుంచి ప్రతి నెలా డబ్బును బ్యాంకులో జమ చేయకుండా తన వద్ద ఉంచుకున్నాడు. ఏడు నెలలుగా కాజేసినవి మొత్తం రూ.35 లక్షల అయ్యాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ సీఎంఎస్ విభాగం పసిగట్టడంతో డబ్బు స్వాహా చేసిన వెలుగులోకి చూసింది. కౌంటర్ లో డబ్బు స్వాహా ఘటన బెల్లంపల్లిలో చర్చనీయాంశంగా మారింది. దీంతో రైల్వే అధికారులు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు బెల్లంపల్లి ఆర్పీఎఫ్, సివిల్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. అధికారులు మాత్రం ఈ విషయంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.

