DIGITAL MANCHERIAL NEWS:-
రాష్ట్రం ఏర్పాటుతో ఆదివాసుల బతుకులు మారుతాయని ఆశపడిన ఆదివాసులకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ఏ పల్లెలో చూసిన ధరణి పేరుతో మోసపోయారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కాసిపేట మండలంలోని గుర్వాపుర్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. నేటికీ గ్రామంలో సరైన రహదారులు లేక, పోడు భూములతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ధరణి పేరిట ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా ఆదివాసీల భూములను స్వాధీనపరుచుకున్నారని, అగ్రకులాల కొరకే ధరణి వ్యవస్థను తీసుకువచ్చారని ఆరోపించారు. నేటికీ ఏ గ్రామంలో చూసిన ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించిన ఇండ్లు కనిపిస్తున్నాయని, గృహలక్ష్మి పేరిట మరొకసారి మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయంతో పాటు, 500 రూపాయలకే గ్యాస్ బండను అందిస్తామని అన్నారు. ఇది వరకు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే ఈ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షులు సిద్ధం తిరుపతి, మండల యువజన అధ్యక్షులు రాకేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు స్వామి, మైదం రమేష్, శివ, జంపన్న, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.



