తాళ్ల గురజాలను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను హైదరాబాదులోని తన నివాసంలో కలిసి బెల్లంపల్లి రూరల్ మండల కేంద్రాన్ని బైఫర్ కేషన్ చేసి తాళ్ల గురజాల మండల కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింగం గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి కోరడం జరిగింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బెల్లంపల్లి మండలంలో 17 గ్రామాలు ఉన్నాయని... కాబట్టి బెల్లంపల్లి రూలర్ మండల కేంద్రాన్ని బైఫర్ కేషన్ చేసి తాళ్ల గురజాల ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తాళ్లపల్లి అశోక్ గౌడ్, కారుకూరి వెంకటేష్, నాయకులు అశోక్ గౌడ్, మల్లేష్ వెంకటేష్ గౌడ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by