DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎసిసి- 3 అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎఎన్ఎం దివ్య మాట్లాడుతూ... నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత ఏర్పడి శారీరక, మానసిక ఎదుగుదల మందకొడిగా ఉంటుందన్నారు. అల్బెండజోల్ మాత్ర వేసుకోవడం వల్ల పిల్లల్లో నట్టలు, నులిపురుగులు నిర్మూలించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ ఎన్. పద్మ, తదితరులు పాల్గొన్నారు.

