DIGITAL MANCHRRIAL NEWS:- మందమర్రి మండల కేంద్రంలో గత 30 రోజులుగా డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు TPCC ప్రధాన కార్యదర్శి, OUJAC చైర్మన్, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థి దుర్గం భాస్కర్ పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ గారు మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారం లోకి రాకముందు రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు ఉండరని అలా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామని చెప్పి చేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల కు పైగా పంచాయతీ కార్మికులు 31 రోజులకు పైగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో ఉంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తమ బాధ్యతను మరిచి కార్మికులను, వారి సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కెసిఆర్ చిన్నకొడుకు గా చెప్పుకునే బాల్క సుమన్ కు వినతి పత్రం ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, బాల్క సుమన్ మహారాష్ట్రలో రాజకీయాలు చేయడం కాదు మొదట చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలని లేదంటే రాబోవు రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను సాగనంపడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా చేతకాని దద్దమ్మ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి,వేతనాలు పెంచాలని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు భయపడి కెసిఆర్ రైతు రుణమాఫీ చేశారని, కానీ అందులో కూడా కెసిఆర్ రైతులను మోసం చేస్తున్నారని, వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రైతులు తీసుకున్న రుణాలు అన్నీ మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
2019 సంవత్సరం లో రాహుల్ గాంధీ గారి పై నమోదైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విదించిన శిక్ష పై ఈ దేశ సుప్రీంకోర్టు స్టే విధించడం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇది పూర్తిగా ప్రజాస్వామ్య రాజ్యాంగ పరమైన విజయమని,ఈ విజయాన్ని పురస్కరించుకొని కార్మికులకు అక్కడున్న ప్రజలకు మిఠాయిలు పంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విద్యార్థి జేఏసీ చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుడు ఇబ్రహీం, ప్రవీణ్, సల్మాన్ పాష, జుమ్మిడి గోపాల్, శివ, తరుణ్, దుర్గం మల్లేష్, శ్రీనివాస్, అభిరామ్, రాహుల్, రాజకుమార్, మురారి, అన్వర్ లు పాల్గొన్నారు.


