గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా పంచాయతీ అధికారి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కన్నెపల్లి మండల కేంద్రంలోని వీరాపూర్ గ్రామపంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు పలు వాడలను పరిశీలించారు.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గ్రామపంచాయతీలోని ప్రతి రోడ్డు, నాలీలు శుభ్రంగా ఉంచాలని, ప్రతి రోజు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని, ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లిన చెత్తను డంపింగ్ యార్డ్ లో చెత్తను వేరు చేయాలన్నారు.



 అలాగే కంపోస్టు ఎరువును పీపీవీ ఎవన్యూ ప్లానిటేషన్ లోని మొక్కలకు వేయాలని, ప్లాస్టిక్ వస్తువులను అమ్మి వేసి ఆ డబ్బులను గ్రామపంచాయతీ అకౌంట్ కు జమ చేయాలని, క్రిమిటోరియం చుట్టు మొక్కలు నాటించాలని, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం గ్రామపంచాయతీలో జరగాలని ఆదేశించారు. బృహత్ పల్లెప్రకృతి వనాలకు బయో పెన్షింగ్ ఏర్పాటు చేయాలని వీటి నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ పంచాయితీ పంచాయితీ అధికారి కొమ్మెర సతీష్ కుమార్, సర్పంచ్లు పుల్లూరి సురేఖ, జిల్లెల అశోక్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by