DIGITAL MANCHERIAL NEWS:- నిర్మల్ జిల్లాలోని కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమయింది.
అతని వయసు 35 నుండి 40 సంవత్సరాలు మధ్య ఉంటుందని, మృతదేహం శరీరంపై నీలం రంగు అంగి నల్ల రంగు కాటన్ జిన్ పాయింట్, నల్ల బెల్టు కలదు. చామన చాయ రంగు, బట్టతల కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత వ్యక్తికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్న పోలీసు వారికి 8712659525 మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి తెలుపగలరని కడం ఎస్సై కొసాన రాజు అన్నారు.

