DIGITAL MANCHERIAL NEWS:-
GDS POSTAL JOBS:- తపాలా శాఖలో 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 28,740 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (Schedule-I, January-20256) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 14వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:-
- గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు
మాస్టర్/ డాక్ సేవక్: 28,740 పోస్టులు
సర్కిల్ వారీగా ఖాళీలు:-
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు:- 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాలు:- నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం:- అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.
దరఖాస్తు ఫీజు:- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిల్‌లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి.
ముఖ్యమైన తేదీలు:-
- ఆన్‌లైన్ వన్‌టైం రిజిస్ట్రేషన్:- 31.01.2026- 14.02.2026
- ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు ఫీజు సమర్పణకు చివరి తేదీ: 02.02.2026- 16.02.2026.
* దరఖాస్తు సవరణలకు అవకాశం: 18.02.2026 to 19.02.2026 వరకు.

