ఫ్లాష్ న్యూస్: అక్రిడిటేషన్ కార్డులు కోసం ధరఖాస్తులు స్వీకరణ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-

- అక్రిడిటేషన్ కార్డులు కోసం ధరఖాస్తులు స్వీకరణ.

-- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్.





మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు అర్హులైన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని శనివారం మంచిర్యాల జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో అక్రిడిటేషన్ మాడ్యూల్ వెబ్ సైట్ ప్రారంభించడం జరిగిందని, 2026-28 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనుందని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. మీడియా యాజమాన్యాలు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కొరకు తమ ప్రతినిధుల పేర్లను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి పంపించాలని ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి సంబంధిత వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by