DIGITAL MANCHERIAL NEWS:-
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ ఇంగ్లీష్, తెలుగు, కామర్స్, కంప్యూటర్, జువాలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు.
- ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం.
- ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్.
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న బాటనీ ఇంగ్లీష్, తెలుగు, కామర్స్, కంప్యూటర్, జువాలజీ గెస్ట్ లెక్చరర్ పోస్టులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులతో పాటు(ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పీహెచ్డీ లేనిపక్షంలో నెట్ అర్హత కలవారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నెట్ తర్వాత స్లెట్ లేదా సెట్ అర్హత గల వారిని తీసుకుంటామని స్పష్టం చేశారు. పై అర్హతలు అభ్యర్థులు లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. డిగ్రీ స్థాయిలో బోధన అనుభవానికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపికైన వారికి ఒక్కో పీరియడ్ కు 390 రూపాయల చొప్పున రోజుకు గరిష్టంగా 4 పీరియడ్లను ఇవ్వడం జరుగుతుందని, గరిష్టంగా నెలకు 72 పీరియడ్లకు గాను 28,080 రూపాయల రెమ్యూనరేషన్ లభిస్తుందని వివరించారు. ఇంటర్వ్యూలు మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లా ఐడి కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ సమయం సమాచారం మీకు ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా మరియు మెసేజ్ వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు
- దరఖాస్తుకు సర్టిఫికెట్లు జతచేయండి:-
గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికెట్లతోపాటు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, నెట్, సెట్ తదితర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ లతోపాటు ఆధార్ కార్డు, లోకల్ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుతో పాటు జత చేయాలని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఇట్టి దరఖాస్తులను బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కార్యాలయంలో ఈనెల 18వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల లోపు అందజేయాలని సూచించారు. వివరాలకు సందేహాలకు 9959269975 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు

