DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వివిధ కేసులకు సంబంధించిన ద్విచక్ర వాహనాలను ఫిబ్రవరి 25వ తారీకు ఉదయం 10 గంటలకు మంచిర్యాల పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ లో వేలంపాట నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గురవయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
స్టేషన్ ఆవరణలో నిర్వహించే వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం, ఇతర సంబంధిత సమాచారం కోసం కానీ సమీప ఎక్సైజ్ స్టేషన్ ను సంప్రదించగలరని సూచించారు.

