DIGITAL MANCHERIAL NEWS:-
- జనహిత అన్నపూర్ణ 387 వ సారి అన్నదాన కార్యక్రమం.
- కీ.శే. దాసి రమాదేవి12 వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం.
బెల్లంపల్లి పట్టణంలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం 387 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ... అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందని దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు 387 వ సారి అన్నదాన కార్యక్రమం కొరకు దాత కీ.శే. శ్రీమతి దాసి రమాదేవి గారి 12 వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీమతి శ్రీ దాసి ఉమాదేవి-సదానందం దంపతులు యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత దాసి ఉమాదేవి-సదానందం దంపతులు కుటుంబ సభ్యులు దాసి సతీష్, చిప్ప అజయ్ మరియు జనహిత సేవా సమితి సహాయ కార్యదర్శి గొడిసెల శేఖర్, కార్యవర్గ సభ్యులు భీమిని కనకయ్య, నిచ్చకోల గురుస్వామి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

