DIGITAL MANCHERIAL NEWS :- బెల్లంపల్లి నియోజకవర్గం లోని బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో జరిగిన BRS పార్టీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, BRS పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు, మంచిర్యాల జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల BRS పార్టీ ఇంఛార్జిలు నగేష్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి తదితరులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ BRS పార్టీ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో, బెల్లంపల్లి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని మరియు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన అమలుకానీ హామీల బాకీకార్డును బేరీజు వేసుకుని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు అమలు కావాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో కౌన్సిలర్లుగా BRS పార్టీ అభ్యర్థుల యొక్క కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని తద్వారా కెసిఆర్ కి మద్దతు ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ 34వ వార్డుల అభ్యర్థులు, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, బెల్లంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్, BRSV జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, BRSY నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్, BRS పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


