- చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి.
- ఆవడం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.
- కునారపు లింగయ్య (58).
-- మంచిర్యాల జిల్లాలోని నేన్నెల మండలంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆవడం గ్రామంలోని గుండ్ల చెరువులో చేపల పెట్టేందుకు వెళ్లిన మత్స్యకారుల్లో కునారపు లింగయ్య (58) అనే వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం చేపలు పెట్టేందుకు ఉదయం గ్రామంలోని గుండ్ల చెరువుకు వెళ్ళాడు. చేపలు పడుతుండగా నీటి శాతం ఎక్కువ ఉన్నవైపు వెళ్లగా కాళ్లకు వల చుట్టుకోవడం తో అకస్మాత్తుగా నీటిలో మునిగి మృతి చెందినట్లు చెంది చెప్పారు. మృతుని భార్య రామక్కా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

