హౌజ్లో మోటార్లకు అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 26 వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మిషన్ భగీరథ ఈఈ రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మాణిక్లూడ ఏడీఏ వద్ద ఉన్న 115 ఎంఎల్డీ పనిచేస్తున్న వాటర్ ట్రిడ్ మెంట్ ప్లాంట్లో గల క్లియర్ వాటర్ పంప్ హౌజ్ మోటార్లకు అత్యవసర మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. వేసవి ముందస్తు కార్యాచరణలో భాగంగా పంప్ సెట్లలోని సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వేసవి ముందస్తు కార్యాచరణలో భాగంగా పంప్ సెట్లలోని సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెనతోపాటు సిర్పూర్(టి), బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలకు ఈ నెల 26 రాత్రి 11 గంటల వరకు తాగునీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

