ఫ్లాష్ న్యూస్:- నీళ్ల సమస్యను పరిష్కరించిన సర్పంచ్ జాడి లక్ష్మి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని బోరు గత కొన్ని రోజుల  నుంచి పనిచేయకపోవడంతో నీళ్ల రాక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉందని కాలని వాసులు సర్పంచ్ జాడి లక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ బోరు మరమ్మతులు చేయించి నూతన స్టాటర్ ని ఏర్పాటు చేయించారు. తమ దృష్టికి తీసుకు వెళ్ళగానే సమస్యను తెలుసుకొని వెంటనే పరిష్కరించినందుకుగాను గ్రామ సర్పంచుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల మొగిలి, వార్డు సభ్యులు చింత శారద, బోర్లకుంట రాజేష్, పంచాయితీ కార్యదర్శి సాయి తేజ, మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ జాడి నారాయణ, లింగంపల్లి రాజేష్, ఆవుల భీమన్న, అంకులు రాజం తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by