DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రం లోని కోణంపేట గ్రామం ఆమ్లెట్ పాటి 120 జెనాభా, మన్నెగూడెం ఆమ్లెట్ బొగంపల్లి 140 జెనాభా కలిగిన గిరిజన వాడలు, కోణంపేట ప్రాథమిక పాఠశాలనుండీ పాటి ఒక కిలోమీటర్ 2చిన్న ఒర్రెలు, అదనంగా బొగంపల్లి ఒక కిలోమీటర్లు గిరిజన కోలామ్స్ ప్రజలు నివసిస్తారు.
ఈ వాడలకు వెళ్ళాలి అంటే నాలుగు చిన్న చిన్న వాగులు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బొగంపల్లి నుండీ ప్రాణహిత కాలువ నిలగిరి తోట వరకు 1km రోడ్డు మంజూరు అయ్యి బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు బ్రిడ్జిలు నిర్మిస్తే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని గ్రామస్థులు వేడుకుంటున్నారు. అయితే మరో కిలోమీటర్ రోడ్డు కు అనుమతులు లేవని అధికారులు తెలుపుతున్నారు మిగిలిన కిలోమీటర్ ప్రధాన రోడ్డు బొగంపల్లి కి, పాటి వాడకు సీసీ రోడ్డు,సీఎం గిరివికాస క్రింద ఏర్పాటు చేసిన బోర్లకు విద్యుత్ సౌకర్యం, గిరిజనులకు పోడు పట్టాలు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి పలు సమస్యలపై తక్షణమే ఎంక్వయిరీ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు అదేశించారు. ఈ కార్యక్రమం లో కొలవార్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ జెడ్.పి.టి సి సభ్యులు కొడిపే శంకర్, మన్నెగూడెం సర్పంచ్ బానోత్ మధుకర్, మాజీ సర్పంచ్ బాపు, మాజీ ఉప సర్పంచ్ మధునయ్య,వార్డ్ సభ్యులు మారయ్య యువకులు సురేష్, భీమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

