DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని ఆవడం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహణ పనులు చేపట్టనున్నారు.
ఈ కారణంగా ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఆవడం, గంగారం, కొత్తూరు, చిత్తాపూర్, మెట్‌పల్లి, జెండా వెంకటాపూర్, నార్వాయిపేట్ తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యొక్క అసౌకర్యానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు.

