బ్రేకింగ్ న్యూస్:- దొంగ నోట్లు చెలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- 


- దొంగ నోట్లు చెలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.

- పోలీసువారు పట్టుకున్న ఫేక్ కరెన్సీ: Rs. 5,98,500.

- పోలీసువారు పట్టుకున్న వాహనాలు- 3.


మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొంతకాలంగా ప్రజలను, వ్యాపారులను ఆందోళనకు గురిచేసిన దొంగ నోట్ల వ్యవహారంలో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఏసీపీ ప్రకాష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేసులో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా రూ. 5,98,500 విలువైన ఫేక్ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల రవాణాకు ఉపయోగించిన మూడు కార్లను సీజ్ చేశారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్‌ఐ గోపతి సురేష్ ఏసీపీ అభినందించారు. 

-- పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు:-

A1 కానగంటి క్రాంతి, లక్షేటిపేట రియల్ ఎస్టేట్

A2 గడిగొప్పుల రవీందర్, ఆటో డ్రైవర్,లక్షేటీపేట

A3 తాండ్ర ప్రకాష్ Rk 6. శ్రీరాంపూర్ 

A4 కొంక మధుకర్, వెంకట్రావు పేట 

A5 సుంకే సురేష్,గోదావరిఖని

A6 కామిని అనిల్, సుల్తానాబాద్

A7 రామ్ నాయక్ బేకరీ. లక్షేటిపేట 

A8 నగునూరి రాము, లక్షేట్టిపేట

A9 దేవబోయిన సంపత్ కుమార్ (బెజ్జంకి)

A10 కాడుమండ్ల తిరుపతి (జెండా వెంకటాపూర్)

A11 గోల్ల కుమారస్వామి (పెరకపల్లి)

A12 బండారి సత్యనారాయణ (రంగపేట)


వీరితోపాటు మరి కొంతమంది ఉండగా... వారు పరారీ లో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇట్టి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సి‌ఐ లక్సెట్టిపేట్ డి. రమణమూర్తి, SI లక్సెట్టిపేట్ జి.సురేష్, SI దండేపల్లి మరియు లక్షెట్టిపేట పోలిస్ సిబ్బందిని మంచిర్యాల ACP మరియు DCP అభినందించారు.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by