బ్రేకింగ్ న్యూస్:- బాటనీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- 


21న బాటనీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూ, డెమో.

- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ.

- మంచిర్యాల ఐడి డిగ్రీ కళాశాలలో నిర్వహణ.

- ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్.



- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ అయిన బాటనీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు గాను అభ్యర్థులు ఈనెల 21న మంచిర్యాల ఐడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ మరియు డెమోకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ముందస్తుగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు 21వ తేదీన మంచిర్యాల ప్రభుత్వ ఐడి డిగ్రీ కళాశాలకు గోదావరి రోడ్ మంచిర్యాలలో ఉదయం 10 గంటలకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులతో పాటు(ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పీహెచ్డీ లేనిపక్షంలో నెట్ అర్హత కలవారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నెట్ తర్వాత స్లెట్ లేదా సెట్ అర్హత గల వారిని తీసుకుంటామని స్పష్టం చేశారు. పై అర్హతలు అభ్యర్థులు లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. డిగ్రీ స్థాయిలో బోధన అనుభవానికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 9959269975 సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by