- బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.
- బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ 26వ వాడ నుండి గెలుపొందిన కుమారస్వామి.
- 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్.
- కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలసిన బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాజకీయం శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఏ క్షణం ఏమి జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి వాతావరణం నెలకొంది. శుక్రవారం వెలుబడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుండి 26 వాడ నుండి గెలుపొందిన కుమారస్వామి, అలాగే 30 వార్డ నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన శంకర్ సింగ్ ఇద్దరూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు భారతీయ జనతా పార్టీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామ్మూర్తి కూడా కేటీఆర్ ను కలిశారు. మీరు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీకి మరింత బలం పెరుగుతుంది. అధికార పార్టీ నుండి సైతం ప్రతిపక్ష పార్టీలోకి అభ్యర్థులు రావడంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడింది.

