DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ 34 వార్డుల BRS పార్టీ అభ్యర్థులకు వారి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి మున్సిపాలిటీ BRS పార్టీ ఇంచార్జిలు నగేష్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈక్షణం నుండి ఎన్నికలు అయిపోయేవరకు అభ్యర్థులు అందరూ వారి వార్డుల్లో ప్రతి గడపకు వెళ్లి BRS ప్రభుత్వహయాంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని, అమలైన సంక్షేమ పథకాలను, అలాగే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల బాకీకార్డును వివరించి అనుక్షణం ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ సుందర్ రావు గారు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్ గారు, పట్టణ యూత్ అధ్యక్షుడు అరుణ్ గారు, BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

