DIGITAL MANCHERIAL NEWS:-
- డాక్టర్ కూనురాజుల సమ్మక్క సునీతకు సన్మానం.
- సబర్మతి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందిన సందర్భంగా.
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో అతిథి లెక్చరర్ గా విధులు.
- హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, బోధన, బోధనేతర సిబ్బంది.
-- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాల పొలిటికల్ సైన్స్ సీనియర్ అతిథి లెక్చరర్ కూనురాజుల సమ్మక్క పిహెచ్డి డాక్టరేట్ అందుకున్న సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర బృందం డాక్టర్ కూనురాజుల సమ్మక్కరు సన్మానం చేయడం జరిగిందని ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల "సబర్మతి విశ్వవిద్యాలయం"లో కూనురాజుల సమ్మక్క పార్ట్ టైం పిహెచ్డి చేశారు. ఆ యూనివర్సిటీలోని సూపర్ వైజర్ డాక్టర్ శివకుమార్ వైష్ గైడ్ షిప్ లో "ఎ సోసియో పొలిటికల్ స్టడీ ఆఫ్ ట్రైబల్ ఉమెన్స్ రోల్ ఇన్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్'' అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన పూర్తి కాగా ఇటీవల యూనివర్సిటీలో ఓపెన్ వైవా నిర్వహించారు. కూనురాజుల సమ్మక్క వ్యక్తం చేసిన పరిశోధన అంశాలు ఎగ్జామినర్లను సంతృప్తి పరచడంతో సమ్మక్కకు పీహెచ్డీ డాక్టరేట్ ప్రకటించారు.
*మహమ్మద్ ఖాసిం బస్తీ నుంచి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసిం బస్తికి చెందిన కూనురాజుల సమ్మక్క అకాడమిక్ విద్య పూర్తి చేసిన అనంతరం 2000 సంవత్సరం నుండి బెల్లంపల్లి క్లబ్ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్ ఉపాధ్యాయురాలిగా చేరారు. బెల్లంపల్లి టేకులబస్తి హై స్కూల్ లో కంప్యూటర్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. బెల్లంపల్లి బజార్ ఏరియా బ్రాంచ్ హైస్కూల్ లో విద్యా వాలంటీర్ గా విధులు నిర్వహించి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు సైతం తరగతులు బోధించారు. 2022 నుండి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ అతిధి అధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2024 నుండి బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలలో పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు తరగతులు బోధన చేస్తూ విధులు కొనసాగిస్తున్నారు. ఇలా పాతికేళ్లకు పైగాని ఆమె విద్యారంగంతో అనుబంధం కలిగి ఉన్నారు.
- డాక్టరేట్ సాధనపై సర్వత్రా హర్షం...
కూనురాజుల సమ్మక్క సబర్మతి విశ్వవిద్యాలయంలో పిహెచ్డి సీటు పొంది పరిశోధన పూర్తి చేశారు. సమ్మక్క పిహెచ్డి వంటి ఉన్నత డిగ్రీని పొందడం పట్ల యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, రిజిస్టార్ , పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ వారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ , ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తన తల్లిదండ్రులు కూనురాజుల వెంకటి, లక్మి, పోసు, అన్నయ్య కూనురాజుల శ్రీనివాస్, వదినలు, అల్లుళ్లు, అక్కలు, బావలు, చెల్లెలు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి ప్రజలు, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కళాశాల సూపరింటెండెంట్ పుప్పాల శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, కళాశాల పూర్వ విద్యార్థులు పత్రికా రంగం ప్రింట్, ఎలక్ట్రానిక్, మరియు ఆన్లైన్ మీడియా వారు, న్యాయవాదులు ప్రజాప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

